మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dattatreya Prarthana Stotram – శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం
సమస్తదోషశోషణం స్వభక్తచిత్తతోషణం
నిజాశ్రితప్రపోషణం యతీశ్వరాగ్ర్యభూషణమ్ |
త్రయీశిరోవిభూషణం ప్రదర్శితార్థదూషణం
భజేఽత్రిజం గతైషణం విభుం విభూతిభూషణమ్ || 1 ||
సమస్తలోకకారణం సమస్తజీవధారణం
సమస్తదుష్టమారణం కుబుద్ధిశక్తిజారణమ్ |
భజద్భయాద్రిదారణం భజత్కుకర్మవారణం
హరిం స్వభక్తతారణం నమామి సాధుచారణమ్ || 2 ||
నమామ్యహం ముదాస్పదం నివారితాఖిలాపదం
సమస్తదుఃఖతాపదం మునీంద్రవంద్య తే పదమ్ |
యదంచితాంతరా మదం విహాయ నిత్యసమ్మదం
ప్రయాంతి నైవ తే భిదం ముహుర్భజంతి చావిదమ్ || 3 ||
ప్రసీద సర్వచేతనే ప్రసీద బుద్ధిచేతనే
స్వభక్తహృన్నికేతనే సదాంబ దుఃఖశాతనే |
త్వమేవ మే ప్రసూర్మతా త్వమేవ మే ప్రభో పితా
త్వమేవ మేఽఖిలేహితార్థదోఽఖిలార్తితోఽవితా || 4 ||
ఇతి శ్రీమద్వాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.